ఈ దినం సదా నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2)
రానున్న కాలము - కలత నివ్వదు (2)
నా మంచి కాపరీ సదా - నన్ను నడుపును
||ఈ దినం||
ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాటయైనను (2)
వెరవదెన్నడైనను నాదు హృదయము (2)
గాయపడిన యేసుపాదం అందు నడచెను (2)
||ఈ దినం||
ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే
విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
యెహోవా నిస్సియే నాదు విజయము
||ఈ దినం||
