Worship

దేవా యెహోవా సీయోనులో నుండి

Devaa Yehovaa Seeyonulo Nundi

Watch on YouTube
దేవా యెహోవా సీయోనులో నుండి స్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద (2) కను మూసినా కను తెరిచినా - కనిపించె నీ రూపం కల కానిది నిజమైనది - సిలువలో నీ త్యాగం రక్తాన్ని చిందించి రక్షించినావా ఈ పాపిని యేసయ్యా నా దేవా.. నా ప్రభువా… నీకేమర్పింతును - (2) ||దేవా|| నను మోసిన నను కాచిన - నా తండ్రి నీవయ్యా నా శిక్షను నీ శిక్షగా - భరియించినావయ్యా ప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకై బలియైతివా యేసయ్యా నా దేవా.. నా ప్రభువా… నీ సిలువే చాలయా - (2) ||దేవా||