దూత పాట పాడుడీ - రక్షకున్ స్తుతించుడీ
ఆ ప్రభుండు పుట్టెను - బేత్లెహేము నందున
ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు
నీవొంద గాఢనిద్రపై - వెలుంగు తారలు
ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు
బేత్లెహేమందు నేడు జన్మించెన్
శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో
ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు
పొలములలో తమ మందలను కాయుచునున్నప్పుడు
భూనివాసులందరు - మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి - ఆత్మ శుద్ధి కల్గును
జ్ఞానులారా మానుడింక యోచనలన్ జేయుట
మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్
సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము
ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి
రండి నేడు పుట్టినట్టి
రాజునారాధించుడి (2)
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
యేసు పుట్టగానే వింత - (2)
ఏమి జరిగెరా దూతలెగసి వచ్చెరా - (2)
నేడు లోక రక్షకుండు - (2)
పుట్టినాడురా ఈ పుడమి యందున - (2)
పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో - (2)
పవళించెను… పవళించెను…
పవళించెను నాథుడు మన పాలిట రక్షకుడు - (2)
దూతల గీతాల మోత విను బేతలేమా
పరమ దూతల గీతాల మోత విను బేతలేమా
ఎన్నెన్నో యేడుల నుండి నిరీక్షించినట్టి - (2)
పరమ దూతల గీతాల మోత విను బేతలేమా - (2)
