Prayer

చూచుచున్నాము నీ వైపు

Choochuchunnaamu Nee Vaipu

Watch on YouTube
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక - చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ - సొంపు సువార్తను జాచుచు గరములు - చక్కగా నీవైపు ||చూచు|| మేమరులమై యుంటిమి మార్గము వీడి - మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు - ప్రియ తనయు నంపించి క్షేమ మార్గము మాకు - బ్రేమను జూపితివి ||చూచు|| నిను నమ్ము పాపులకు వారెవరైనా - నీ శరము జొచ్చువారలకు ఇనుడవు కేడెంబు - నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు - ఘనమైన నీ కృప ||చూచు|| నీ భయము మాయెదలను నిలుపుము నీదు - ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము - వైభవ మొందుచు నే భయము లేకుండ - నీ భువిని గొన్నాళ్ళు ||చూచు|| దయ జూచి మము నెప్పుడు మంచివి యన్ని - దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి - దయచేయుమని కోర దయ జూపి మన్నించు - దయగల మా తండ్రి ||చూచు||