Good Friday

చూచితి నీ మోముపై చిందిన రక్తము

Choochithi Nee Momupai Chindina Rakthamu

Watch on YouTube
చూచితి నీ మోముపై - చిందిన రక్తము తలచితి నీ ప్రేమను - మదికి అందనిదాయె రాజ మకుటము మారిపోయే - ముళ్ల మకుటముగా సింహాసనమే సిలువగ మారి - శిక్షకు గురియాయేగా పరిమితి లేని కలువరి ప్రేమను - పరిహాసము చేసిరే ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే - చాలని నీ చెంత చేరితిని యేసు.. ||చూచితి|| నేలపై ఒలికిన నీ రక్తధారలే - ప్రతి పాపిని కడిగెను ఆ రక్తధారలే పాపికి మార్గమై - పరముకు ప్రవహించెను (2) మట్టి దేహమును - మహిమగ మార్చుటకు (2) మాపై నీకున్న సంకల్ప ప్రేమను - పరిహాసము చేసిరే (2) యేసు.. ||చూచితి|| సిలువలో చిందిన రక్తపు జల్లులు - ప్రతి రోగిని తాకెను చితికిన దేహమున ఒలికిన రుధిరము - పరమౌషధమాయెను (2) మా రోగములను - భరియించుటకు (2) మాపై నీకున్న ఎనలేని ప్రేమను - అవహేళన చేసిరే (2) యేసు.. ||చూచితి||