Good Friday

చిందింది రక్తం ఆ సిలువ పైన

Chindindi Raktham Aa Siluva Paina

Watch on YouTube
చిందింది రక్తం ఆ సిలువ పైన కారింది రుధిరం కలువరిలోన (2) కరుణ చూప లేదే కసాయి మనుష్యులు కనికరించలేదే మానవ లోకం (2) ||చిందింది|| ఏదేనులో పుట్టిన ఆ పాపము శాపముగా మారి మరణ పాత్రుని చేసె (2) ఆ మరణమును తొలగించుటకు మరణ పాత్రను చేబూనావా (2) నా మరణమును తప్పించినావా ||కరుణ|| చేసింది లోకం ఘోరమైన పాపం మోపింది నేరం నీ భుజము పైనా (2) యెరుషలేములో పారిన నీ రక్తము ఈ లోక విమోచన క్రయధనము (2) ఈ లోక విమోచన క్రయధనము ||కరుణ|| నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం మరణపు ముల్లును విరిచిన దేవుడా (2) జీవకిరీటము నిచ్చుటకై ముళ్ళ కిరీటము ధరించితివా (2) నాకు నిత్య జీవమిచ్చితివా ||కరుణ||