Mission

భారత దేశ సువార్త సంఘమా భువి దివి సంగమమా

Bharata Desa Suvaarta Sanghamaa Bhuvi Divi Sangamamaa

Watch on YouTube
భారత దేశ సువార్త సంఘమా భువి దివి సంగమమా ధర సాతానుని రాజ్యము కూల్చే యుద్ధా రంగమా ||భారత|| ఎవని పంపుదును నా తరపున ఇల ఎవరు పోవుదురు నాకై నేనున్నాను నన్ను పంపమని రమ్మూ సంఘమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత|| అడవి ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను గనుమా అంధకార ప్రాంతములో ప్రభుని జ్యోతిని వెలిగించను కనుమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత|| బ్రతుకులోన ప్రభు శక్తిలేని క్రైస్తవ జనాంగమును గనుమా కునుకు దివ్వెలను సరిచేయగ ఉజ్జీవ జ్వాలగొని చనుమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||