Christmas

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె

Bethlehem Puramuna Chitrambu Kalige

Watch on YouTube
బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె కర్తాది యేసు జన్మించినపుడు అంధకారంపు పృథివి వీధులలో మోదంపు మహిమ చోద్యంబుగానరే ఉదయంపు తారల్ ముదమున బాడే ఉదయించ యేసు ఈ పృథివిలోన ముదమును గలిగె మరి సమాధానం పదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం|| పరమును విడచి నరరూపమెత్తి అరుదెంచి యేసు పరమ వైద్యుండై నరుల దుఃఖములన్ తొలగించివేసి పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు ||బేత్లేహేం|| నీదు చిత్తమును నాదు హృదయమున ముదమున జేయ మదినెంతో యాశ నీదు పాలనము పరమందు వలెనె ఈ ధరణియందు జరుగంగ జూడ ||బేత్లేహేం|| దేవుని సన్నిధి దీనత నుండ పావనయాత్మ పవిత్ర పరచున్ పావనుడేసు ప్రకాశమిచ్చి జీవంబు నొసగి జీవించు నెదలో ||బేత్లేహేం|| గతించె రాత్రి ప్రకాశించె కాంతి వితానముగ వికసించె నెల్ల దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు అతి ప్రేమతోడ అరుదెంచె నోహో ||బేత్లేహేం||