Prayer

బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయము

Balaparachumu Sthiraparachumu Naa Praarthanaku Baduleeyumu

Watch on YouTube
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయము (2) లోకాశల వైపు చూడకూండా లోకస్థులకు జడవకుండా (2) నీ కృపలో నేను జీవించుటకు ||బలపరచుము|| నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను (2) నే నడచు దారి ఇరుకైననూ నే నిలుచు చోటు లోతైననూ (2) నే జడవక నిను కొలుతును ||బలపరచుము|| ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అను నిత్యము (2) అపవాది నన్ను శోధించినా శ్రమలన్ని నాపై సంధించినా (2) నే జడవక నిను కొలుతును ||బలపరచుము||