Christmas

బాల యేసుని జన్మ దినం వేడుకైన శుభ దినము

Baala Yesuni Janma Dinam Vedukaina Shubha Dinamu

Watch on YouTube
బాల యేసుని జన్మ దినం వేడుకైన శుభ దినము సేవింప రారే జనులారా ముద్దుల బాలకు ముద్దులిడ ||బాల|| మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2) చేకొని లాలింప రారే జో జోల పాటలు పాడి ||బాల|| పాపికి పరమ మార్గము జూప ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2) పశుశాలయందు పవళించే తమ ప్రేమను జూపింప మనకు ||బాల|| మన జోల పాటలు ఆలించు బాలుడు దేవాది దేవుని తనయుడు గనుక (2) వరముల నొసగి మనకు దేవుని ప్రియులుగా జేయు ||బాల||