Faith

అసాధ్యమైనది లేనే లేదు

Asaadhyamainadi Lene Ledu

Watch on YouTube
అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2) ఊహించలేని ఆశ్చర్యక్రియలలో నా దేవుడు నన్ను నడిపించును (2) సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా (2) శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2) సత్య స్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును (2) ||సాధ్యమే|| సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2) సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును (2) ||సాధ్యమే||