Evangelism

అందరూ నమ్మాలిరా యేసయ్యె దేవుడనీ

Andharu Nammaliraa Yesayye Devudanee

Watch on YouTube
అందరూ నమ్మాలిరా యేసయ్యె దేవుడనీ ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజనీ గళమెత్తి పాడాలిరా మహిమా ఘనతా నీకనీ లోకాన చాటాలిరా త్వరలో రానున్నాడనీ యేసయ్య మాటలో విడుదలున్నది యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది యేసయ్య చూపులో క్షేమమున్నది యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది (2) మాటమాత్రం సెలవియ్యగా సమాధిలోని లాజరు బయటికొచ్చెను చిన్నదాన లెమ్మనగా యాయీరు కూతురు తిరిగిలేచెను (2) || యేసయ్య || చల్లనైన చేతిస్పర్శతో గ్రుడ్డివాడు చూపుపొందెను మాట అన్న తక్షణమే పక్షవాయువు వదిలిపోయెను (2) || యేసయ్య || శక్తిగల ఆ చూపుతో సేనదెయ్యములు వదిలిపోయెను బేతెస్థకోనేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థపరచెను (2) || యేసయ్య ||