అంధకార చెరసాలలో - బంధకాల ఇరుకులో
పౌలు సీలలు ప్రార్ధించిరి - కీర్తనలు పాడిరి (2)
భూమియే కంపించెను - చెరసాల అదిరెను
వారి సంకెళ్లు ఊడిపోయెను - విడుదల దొరికెను (2)
వ్యాధులు ఆవరించగా - మరణము తరుముచుండగా
రండి పారి పోదుము - ఇంక దాగి యుందుము
ఏ తెగులు దరిచేరని - ఏ దిగులు ఉండని
మన దాగు స్థలములో - యేసుని సన్నిధిలో
||అంధకార||
ప్రార్ధన చేసెదము - దేవుని సముఖములో
ఈ శోధన సమయములో - విరిగిన హృదయముతో
ఈ లోక రక్షణకై - జనముల స్వస్థతకై
యేసుని వేడెదము - శోకము తొలగించమని
||అంధకార||
మొరలను ఆలకించును - యేసు మనలను విడిపించును
ఈ లోకమును శుద్ధిచేయును - మరణమును తప్పించును
మన రక్షణ వలయముగా - తన రెక్కలు చాపును
దుఃఖమును సంతోషముగా - మార్చివేయును త్వరలో
||అంధకార||
