Worship
ఏ రీతి స్తుతియింతును ఓ యేసూ నాథా దైవమా
Ae Reethi Stuthiyinthunu O Yesu Naathaa Daivamaa
ఏ రీతి స్తుతియింతును ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును
నీ కృపలన్ని తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్లు మిగిలాయయ్యా
||ఏ రీతి||
ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడు గానని నాకు
ఏమౌదునో ఎటు పోదునో ఎటు తోచక నున్న నన్ను
ఏ భయము నీకేల యనుచు అభయంబు నిచ్చావయ్యా
ఏ దారి కనబడని వేళ నీ ఒడిలోపు దాచావయ్యా
||ఏ రీతి||
ఈ మనుష్యులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని
నా ప్రాణము నా దేహము నీ స్వాధీనంభేగదయ్యా
నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగ నిలిచావయ్యా
నాకేమి స్పృహ లేని వేళ ఊపిరిని పోసావయ్యా
||ఏ రీతి||
నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను
నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను
నిజ దైవము నీవే యనుచు నీ వైపే నే చూచానయ్యా
యెహోవా రాఫా నేననుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా
||ఏ రీతి||
