ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా
ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సోమ్మ సిల్లిపోతివ రక్షకా
||ఏ పాప||
కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా
సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా
||ఏ పాప||
చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా
||ఏ పాప||
ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గ్రుచ్చినారా
||ఏ పాప||
పలువిధంబుల శ్రమలు చెలరేగ దండ్రికి నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా
||ఏ పాప||
బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్క జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము
||ఏ పాప||
కట కటా పాప సంకటము బాపుట కింత పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ యెటువంటిదీ శాంత మెటుల వర్ణింతు స్వామి
||ఏ పాప||
