Prayer

ఏ గుంపులో నున్నావో ఎరిగి తెలుసుకో

Ae Gumpulo Nunnavo Erigi Telusuko

Watch on YouTube
ఏ గుంపులో నున్నావో ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2) జాగు చేయక వేగ మేలుకో (2) ||ఏ గుంపులో|| మరణమనెడి మొదటి గుంపు మారని గుంపు నిర్జీవపు గుంపు (2) దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2) ||ఏ గుంపులో|| మెచ్చుకొనుట కిచ్చకంబు లాడెడి గుంపు నులివెచ్చని గుంపు (2) చచ్చియుండిన సమాధుల గుంపు (2) ||ఏ గుంపులో|| కరుణ లేక కఠినమైన కరుగని గుంపు గుర్తెరుగని గుంపు (2) కరకు కల్గిన కఠోరపు గుంపు (2) ||ఏ గుంపులో|| యేసు వాక్యమనగ నేమో ఎరుగని గుంపు విననియ్యని గుంపు (2) ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2) ||ఏ గుంపులో|| ధరణి నరుల తరిమి కొట్టు దయ్యపు గుంపు అదే కయ్యపు గుంపు (2) పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2) ||ఏ గుంపులో|| పరమ తండ్రి కడకు జేర పరుగులెత్తెడి నిరపరాధ జనులకు (2) కావలి కాయు కఠినాత్ముల గుంపు (2) ||ఏ గుంపులో|| సర్వ లోక మోసగాడు ఆది సర్పము అదే ఘట సర్పము (2) సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2) ||ఏ గుంపులో|| వధువు మంద మేయు మర్మ మనగ గమనిక గమనించి తెలుసుకో (2) గదిలో చేరుకో పదిలపర్చుకో (2) ||ఏ గుంపులో||