Second Coming

అదే అదే ఆ రోజు

Adhe Adhe Aa Roju

Watch on YouTube
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే|| వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు (2) నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు ||అదే అదే|| సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు (2) భూకంపం కలిగే రోజు దిక్కు లేక అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు ||అదే అదే|| మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు (2) కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే అదే|| వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు (2) అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొరికే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు ||అదే అదే|| పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక (2) చేట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు ||అదే అదే|| ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2) బలము చూసి భంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు ||అదే అదే||