Worship

ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు

Aascharyaakarudaa Naa Aalochana Karthavu

Watch on YouTube
ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు (2) నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు (2) సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా (2) నీ పిల్లలు - ఆకలితో అలమటింతురా నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు (2) నీ పిల్లలు - వాటికంటే శ్రేష్టులే కదా నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించె (2) నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||