Worship

ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది

Aarani Prema Idi Aarpajaalani Jwaala Idi

Watch on YouTube
ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది (2) అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది (2) కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని|| సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా - మృతిని గెల్చి లేచినది (2) ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది (2) కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని|| నా స్థానమందు నిలిచి - నా శిక్షనే భరియించి క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది (2) నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది ఆ ఉన్నత రాజ్యమందు - నాకు స్థానమిచ్చినది (2) ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది (2) ||ఆరని|| భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు చెరయైనా ఖడ్గమైనా - కరువైనా ఎదురైన (2) ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు (2) ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది (2) ||ఆరని||