Worship
ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో
Aaraadhinchedanu Ninnu Naa Yesayya Aathmatho Sathyamutho
ఆరాధించెదను నిన్ను
నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2)
||ఆరాధించెదను||
నీ జీవ వాక్యము నాలో
జీవము కలిగించె (2)
జీవిత కాలమంతా
నా యేసయ్యా నీకై బ్రతికెదను (2)
||ఆరాధించెదను||
చింతలన్ని కలిగిననూ
నిందలన్ని నన్ను చుట్టినా (2)
సంతోషముగ నేను
నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2)
||ఆరాధించెదను||
