Praise

ఆనందింతుము యేసుని సన్నిధిలో ఆనందింతుము

Aanandinthumu Yesuni Sannidhilo Aanandinthumu

Watch on YouTube
ఆనందింతుము ఆనందింతుము యేసుని సన్నిధిలో ఆనందింతుము హే (2) గంతులేసి నాట్యమాడి ఉత్సహించి పాడెదం (2) యేసుని సన్నిధిలో ఆనందింతుము (2) ||ఆనందింతుము|| భయమూ ఎందుకూ దిగులూ ఎందుకూ దేవాది దేవుని తోడు మనకుండగా (2) హల్లెలూయ అంటు ఆరాధింతుము ఎల్లప్పుడూ (2) యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2) ||ఆనందింతుము|| నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ నీతి సూర్యుడైన యేసు మనకు ఉండగా (2) పరిశుద్ధుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2) యేసుని సన్నిధిలో పరవశించెదం (2) ||ఆనందింతుము|| ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా (2) మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం (2) యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం (2) ||ఆనందింతుము||