ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా దోషమే కదా
||ఆహా||
వీరలను క్షమించు తండ్రి నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు కౄర జనులకై
||ఆహా||
నీవు నాతో పరదైసున నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి పాపి గాచితి
||ఆహా||
అమ్మా నీ సుతుడటంచు మరియమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు కర్త నుడితివి
||ఆహా||
నా దేవ దేవ యేమి విడనాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ చెప్ప శక్యమా
||ఆహా||
దప్పిగొనుచున్నానటంచు చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద నేమి నీకు హా
||ఆహా||
శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి సమసితివి కదా
||ఆహా||
అప్పగింతు తండ్రి నీకు నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా
||ఆహా||
