Worship

ఏగెదను నే చేరెదను

Aagedanu Ne Cheredanu

Watch on YouTube
ఏగెదను నే చేరెదను సీయోనును నే చూచెదను (2) విశ్వాస కర్తయైన నా యేసూ (2) నీ సముఖములో నే మురిసెదను నీ కౌగిలిలో ఉప్పొంగెదను (2) జీవ కిరీటమును నే పొందెదను ||ఏగెదను|| భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును (2) దినదినము నాలో నే చనిపోవుచున్నాను అనుదినము నీలో బ్రతుకుచున్నాను (2) అనుదినము నీలో బ్రతుకుచున్నాను ||ఏగెదను|| నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను (2) మంచి పోరాటముతో నా పరుగును కడముట్టించి జయమొందెదను (2) విశ్వాసములో జయమొందెదను ||ఏగెదను||