Encouragement

ఆగక సాగుమా సేవలో సేవకా

Aagaka Saagumaa Sevalo Sevaka

Watch on YouTube
ఆగక సాగుమా సేవలో ఓ సేవకా ఆగక సాగుమా సేవలో సేవకా (2) ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక (2) ||ఆగక|| పిలిచినవాడు ప్రభు యేసుడు ఎంతైనా నమ్మదగినవాడు (2) విడువడు నిన్ను ఎడబాయడు నాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక|| తెల్లబారిన పొలములు చూడు కోత కోయను సిద్ధపడుము (2) ఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుము (2) ||ఆగక||