Praise

యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు

Yesu Manchi Devudu – Premagala Devudu

Watch on YouTube
యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2) ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) ||యేసు మంచి|| శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు (2) సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) ||యేసు మంచి|| శాంతి సమాధానం మనకిచ్చాడు సమతా మమత నేర్పించాడు (2) మార్గము సత్యము జీవమైనాడు మానవాళికే ప్రాణమైనాడు (2) ||యేసు మంచి||