Devotional

యేసయ్యా నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా

Yesayyaa Nannenduku Ennukunnaavayyaa

Watch on YouTube
యేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా తెలుపుము నీ చిత్తము నా యెడల – (2) ||యేసయ్యా|| ఏ దరి కానక తిరిగిన నన్ను నీ కౌగిటిలో చేర్చుకున్నావయ్యా (2) ఏమి నీ ప్రేమా – ఏమి నీ కృప నా యెడల (2) ఏమి నీ కృప నా యెడల ||యేసయ్యా|| చనిపోయిన స్థితిలో పడిపోయిన నన్ను నీ జీవము నొసగి బ్రతికించావయ్యా (2) ఏమి నీ దాక్షిణ్యం – ఏమి నీ దయ నా యెడల (2) ఏమి నీ దయ నా యెడల ||యేసయ్యా|| శోధనా బాధలో కృంగిన నన్ను నిరీక్షణ నొసగి బలపరచావయ్యా (2) ఏమి నీ ఆదరణ – ఏమి నీ ఆశ నా యెడల (2) ఏమి నీ ఆశ నా యెడల ||యేసయ్యా||