యెహోవా మా కాపరి
యేసయ్య మా ఊపిరి
మాకు లేనిది లేదు లేమి కలుగదు (2)
||యెహోవా||
వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను
ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)
మా ప్రాణములు సేదదీర్చేను
నీతి మార్గమున నడిపించెను
||యెహోవా||
కారు చీకటిలో కన్నీరు తుడిచెను
మరణ పడకలో ఊపిరి పోసెను (2)
మా తోడు నీడై నిలిచి నడచెను
శత్రు పీఠమున విందు చేసెను
||యెహోవా||
పరిశుద్ధాత్మలో ముంచి వేసెను
పరమానందము పొంగిపోయెను (2)
పరలోకములో గొరియపిల్లను
నిరతము మేము కీర్తింతుము
||యెహోవా||
