Faith

యెహెూవాయే నా బలము

Yehoovaaye Naa Balamu

Watch on YouTube
యెహెూవాయే నా బలము యెహెూవాయే నా శైలము (2) యెహెూవాయే నా కోటయు యెహెూవాయే నా కేడెము యెహెూవాయే నా శృంగము యెహెూవాయే నా దుర్గము (2) ||యెహెూవాయే|| నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను (2) నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను (2) ||యెహెూవాయే|| నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను నా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను (2) నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెను నా ముందుగా తానే నడచి నన్ను బలపరచెను (2) ||యెహెూవాయే||