Faith

విత్తనం విరుగకపోతే – ఫలించునా

Vithanam Virugakapothe Phalinchunaa

Watch on YouTube
విత్తనం విరుగకపోతే – ఫలించునా (2) కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం – విశ్వానమే నా బలం (2) పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే – ఇస్తాడు విజయ కిరీటం (2) గొల్యాతును పుట్టించినదే – దావీదును హెచ్చించుటకే (2) కిరీటం కావాలంటే – గొల్యాతులు రావొద్దా? (2) ||శ్రమలే|| సేవించే మహా దేవుడు – రక్షించక మానునా రక్షించక పోయిన - సేవించుట మానము (2) ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే (2) అగ్నిలోకి ప్రభువేరాగా – ఏదైన హాని చేయునా? (2) ||శ్రమలే|| ఇశ్రాయేలు ప్రజలను – ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు – విస్తరించి ప్రబలిరి (2) ఫరోను పుట్టించినదే – ప్రభు శక్తిని చాటుటకే (2) వాగ్దానం నెరవేరా – ఫరోలు రావొద్దా? (2) ||శ్రమలే||