Wedding

విరిసిన హృదయాలకు కలిసెను బంధం

Virisina Hrudayaalaku Kalisenu Bandham

Watch on YouTube
విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2) తీయని భాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే ||విరిసిన|| ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2) ఉన్నదంత చాలని - ప్రభువు మనకు తొడని (2) మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన|| మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం (2) ఏక మనస్సుతోనే - చక్కనైన జీవితం (2) మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన||