వినరే యో నరులారా - వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు - మానుజావతారుడయ్యె - వినరే
అనుదినమును దే-వుని తనయుని పద
వనజంబులు మన-మున నిడికొనుచును
||వినరే||
నర రూపు బూని ఘోర - నరకుల రారమ్మని
దురితము బాపు దొడ్డ - దొరయౌ మరియా వరపుత్రుడు
కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు - కరుణను గనరే
||వినరే||
ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
బూని తన మేని సిలువ - మ్రాను నణచి మృతి బొందెను
దీన దయా పరు-డైన మహాత్ముడు
జానుగ యాగము - సలిపిన తెరంగిది
||వినరే||
ఇల మాయావాదుల మాని - యితడే సద్గురు డని
తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలు-ములనలరెడు ధని
కుల కందని సుఖ-ములు మరి యొసఁగును
||వినరే||
దురితము లణప వచ్చి - మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె
బిరబిర మన మం-దర మా కరుణా
శరనిధి చరణ మె - శరణని పోదము
||వినరే||
