విలువైనది నీ జీవితం
యేసయ్యకే అది అంకితం (2)
ఆ దేవ దేవుని స్వరూపంలో
నిను చేసుకున్న ప్రేమ
తన రూపులో నిను చూడాలని
నిను మలచుకున్న ప్రేమ
ఈ మట్టి ముద్దలో - తన ఊపిరే ఊది
నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ
తన కంటి రెప్పలా - నిను కాచేటి
క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా…
||విలువైనది||
ప్రతి అవసరాన్ని తీర్చే
నాన్న మన ముందరుండగా
అనుక్షణమున నీ చేయి విడువక
ఆయనీతో నడిచెగా
ఎటువంటి బాధైనా - ఏలాంటి శ్రమ అయినా
నిను విడిపించే దేవుడుండగా
అసాధ్యమేముంది - నా యేసయ్యకు
సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు
||విలువైనది||
