విడువదు మరువదు - విడువదు మరువదు
విడువదు మరువదు - ఎన్నడూ ఎడబాయదు
ఎనలేని ప్రేమ - విలువైన ప్రేమ
మితిలేని ప్రేమ.. నీ ప్రేమ
||విడువదు||
నా స్థితి ఏదైనా - చింత ఏదైనా
బాధ ఏదైనా - నను విడువదు
లోకమే నను చుట్టినా - ఆశలే నను ముట్టినా
యేసయ్య సాన్నిధ్యం - నను విడువదు
మా నాన్న నా చేయి విడువడు
ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2)
విడువడు మరువడు - విడువడు మరువడు
విడువడు మరువడు - ఎన్నడూ ఎడబాయడు
నన్ను ఎత్తుకున్న - నన్ను హత్తుకున్న
నా తండ్రి కౌగిలి - నే విడువను
శోకమే కృంగించినా - దుఃఖమే బాధించినా
నా ప్రియుని చిరునవ్వు - నే మరువను
నన్నెంతో ప్రేమించిన రాజును
ఎడబాసి మనలేనే రోజును (2)
విడువను మరువను - విడువను మరువను
విడువను మరువను - ఎన్నడూ ఎడబాయను
ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ
మితిలేని ప్రేమ.. నీ ప్రేమ
||విడువను||
