Christmas

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా

Vachchindi Vachchindi Vachchindi Christmas Panduga

Watch on YouTube
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు - వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు - త్రాగుబోతు విందులు కాదు (2) మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ ||వచ్చింది|| రంగురంగు వస్త్రాలు - మురికిగుడ్డల మనస్సులు మెరిసిపోతున్న ఇళ్ళు - మాసిపోయాయి హృదయాలు ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు పేరుకేమో క్రైస్తవులు - తీరుమారని జనులు (2) ||ఇంటికి|| విద్యలేని పామరులు - విధేయులై బ్రతికారు విద్యవున్న సోమరులు - మందిరాలకే రారు తూర్పుదేశపు జ్ఞానులే - మోకాళ్ళు వంచినారు చదువు పదవుంటే చాలు - మోకరించరు వీరు (2) ||ఇంటికి|| దినములు చెడ్డవి గనుక - సమయమును పోనియ్యక అజ్ఞానులవలె కాక - జ్ఞానులవలె నడవాలి పాపము తీయుట కొరకే - ప్రభు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు - ఉత్సవ ఉల్లాసాలా (2) ||ఇంటికి||