Second Coming

వాడబారని విశ్వాసముతో

Vaadabaarani Vishwaasamutho

Watch on YouTube
వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో (2) వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యా నీ రాక కోసమై - కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై - నిన్ను చేరుటకై (2) ||వాడబారని|| మోకాళ్లపై వేచితి - కన్నీళ్ల పర్యంతమై బీడు బారిన నేల వానకై - ఎదురు చూచినా సంఘమై (2) సిద్ధపడియున్న వధువునై ఆశతో వేచానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| లేఖనములను చూచితి - గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్ని - జరుగుట గుర్తించితి (2) రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| నీటి కొరకై వేచిన - గూడ బాతును పోలిన ఆత్మ దాహము తోడనిండి - అల్లాడుచున్నానయ్యా (2) లోక బంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||