Prayer
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా
Unnapaatuna Vachchu Chunnaanu Nee Paada Sannidhi Ko Rakshakaa
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా
ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి
యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను
||ఉన్న||
కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
భూరి దయతో నన్ను నీ దరి - జేర రమ్మని పిలుచుటయు ని
ష్కారణపు నీ ప్రేమ యిది మరి - వేరే హేతువు లేదు నా యెడ
||ఉన్న||
మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై
అసిత మగు ప్రతి డాగు తుడువను - గసుటు గడిగి పవిత్ర పరపను
అసువు లిడు నీ రక్తమే యని - మాసల కిప్పుడు సిలువ నిదె గని
||ఉన్న||
వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము - కలిగె నెమ్మది దొలాగెను
పలు విధములగు సందియంబుల - వలన పోరాటములచే నే
నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె
||ఉన్న||
కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను
సుడివడిన నా మదికి స్వస్థత - చెడిన కనులకు దృష్టి భాగ్యము
బడయ వలసిన వన్ని నీ చే - బడయుటకు నా యొడ యడా యిదె
||ఉన్న||
నీ వాగ్దత్తము నమ్మి - నీపై భారము పెట్టి - జీవ మార్గము గంటిని
కేవలంబగు ప్రేమ చేతను - నీవు నన్ను క్షమించి చేకొని
భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె
||ఉన్న||
దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ - తరమే వర్ణన చేయను
తెరవు కడ్డం బైన యన్నిటి - విరుగ గొట్టెను గాన నే నిపు
డరుదుగా నీ వాడ నవుటకు - మరి నిజము నీ వాడ నవుటకే
||ఉన్న||
