Repentance

త్రాహిమాం క్రీస్తు నాథ

Thraahimaam Kreesthu Naatha

Watch on YouTube
త్రాహిమాం క్రీస్తు నాథ - దయ జూడ రావే నేను - దేహి యనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం|| గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నేనెంతో - నెవ్వ బొందితి త్రవ్వుచున్న కొలది - పెరుగు - దరగదు నా పాప రాశి యివ్విధమున జెడిపోతిని నే - నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం|| నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జా చిత్తము బూని చేయరాని దుష్కర్మములు - చేసినాడను దయ్యాల రాజు చేతిలో - జేయి వేసి వాని పనుల జేయ సాగి నే నిబ్భంగి - జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం|| నిబ్బర మొక్కించుకైన - నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుతకు ము - త్తా నైతిని అబ్బురమైన ఘోర పా - పాంధకార కూపమందు దబ్బున బడిపోతి నయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం|| నిన్ను జేరి సాటిలేని - నిత్యానంద మంద బోవు చున్నప్పుడు నిందలు నా - కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ - వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించితివి నా - యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||