Christmas

తారా వెలిసెను ఈ వేళ

Thaara Velisenu Ee Vela

Watch on YouTube
తారా వెలిసెను ఈ వేళ యేసు పుట్టిన శుభవేళ (2) వెలిగెను ఈ లోకం - మదిలో నిండెను ఆనందం తరగని రక్షణను - మనకై తెచ్చెను ఆ దైవం (2) రండి వార్తను చాటుదాము ఆ రక్షణను పంచుదాము (2) ||తారా|| పశుల పాకే పావనమాయె మంద గొల్లలే తన వారాయె (2) జ్ఞానులొచ్చిరి ఆరాధింప రాజులలో భీతిని నింప (2) ||తారా|| పాపమెరుగని నీతి పరుడు లోకమును కాచే రక్షకుడు (2) కన్య మరియా గర్భమున పుట్టెను దేవుని అంశమున (2) ||తారా|| రాజులకు రాజైన తనకు ఇచ్చుటకు ఏమున్నది మనకు (2) వెండి బంగారముల కన్నా హృదములనర్పిస్తే మిన్నా (2) ||తారా||