Worship

స్వఛ్చంద సీయోను వాసి

Swechchanda Seeyonu Vaasi

Watch on YouTube
స్వఛ్చంద సీయోను వాసి సర్వాధికారి - కస్తూరి పూరాసి (2) వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2) అల్ఫా ఒమేగ తానే (2) ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద|| ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగ జేతున్ - నీ ప్రజలందరి యెదుట (2) పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే (2) లెక్క లేని యద్భుతముల్ (2) మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద|| సంగీతం నాదముల తోడ సీయోను పురము - సొంపుగను చేరితిమి (2) శాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్ (2) దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2) మిక్కిలి ఆనందము కల్గెన్ (2) ||స్వఛ్చంద|| నీలముల పునాదులు వేసి నీలాంజనములతో - మాణిక్య మణులతో (2) సువర్ణ శునీయముల - సూర్య కాంతముతో (2) ప్రశస్త రత్నములతో (2) ప్రవిమలముగా నిను గట్టెదను (2) ||స్వఛ్చంద|| సుమముల హారము సంతోషానంద తైలము నీదే - స్తుతి వస్త్రమును నీదే (2) ఉల్లాస వస్త్రంబు నీదే - విడుదలయి నీదే (2) హిత వత్సరము విముక్తి (2) ఆత్మాభిషేకము నీదే (2) ||స్వఛ్చంద|| జలములలో బడి దాటునప్పుడు బలమై యుండెదను - నీ తోడై యుండెదను (2) నదులలో వెళ్లునప్పుడు - నీపై పారవు (2) అగ్ని మధ్యను నడచినను (2) జ్వాలలు నిను కాల్చగ లేవు (2) ||స్వఛ్చంద|| ఇత్తడి తలుపుల బగుల గొట్టెద నినుప ఘడియలను - విడగొట్టెదను నేను (2) అంధకార స్థలములలోను-న్నట్టి నిధులను (2) రహస్యములో మరుగైన (2) ధనమును నీ కొసంగెదను (2) ||స్వఛ్చంద|| గర్భమున పుట్టినది మొదలు తల్లి యొడిలోన - కూర్చుండినది మొదలు (2) నేను చంక బెట్టుకొన్న - నాదు ప్రజలారా (2) ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2) ఎత్తుకొను వాడను నేనే (2) ||స్వఛ్చంద||