Worship

స్తుతులతో నాట్యముతో

Sthuthulatho Naatyamutho

Watch on YouTube
స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి చేరెదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము హల్లెలూయా హోసన్న (2) ప్రేమ స్వరూపుడా బలశౌర్యములు నీవేగా అధిక స్తోత్రములకూ అర్హుడవు నీవేగా (2) భూలోకమంతట నీ మహిమ నిండియుండెనుగా (2) ||హల్లెలూయా|| జీవనదులన్నియూ చప్పట్లు కొట్టుచున్నవి పర్వత శిఖరములూ సంతసించుచున్నవి (2) ఆకాశము కన్న నీ కృప ఉన్నతమైనదిగా (2) ||హల్లెలూయా|| పరిమళ తైలము నీ నామ ప్రభావమూ ఆకర్షించితివేసూ నీ చెంతకు నన్నూ (2) అగాధ జలములు నీ ప్రేమను ఆర్పజాలవుగా (2) ||హల్లెలూయా||