స్తుతికి పాత్రుడ యేసయ్యా
నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2)
పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2)
నీవే నా రక్షణ - నీవే నా స్వస్థత
నీవే నా విడుదల (2)
||స్తుతికి||
పాప ఊభిలో నుండి - పైకి లేపితివి
మరణ ఛాయను తొలగించి - కరుణ చూపితివి (2)
నీ వైపే చూస్తూ - నీతోనే నడుస్తూ
నీ వెనకే చేరెద యేసూ (2)
||నీవే||
జీవాహారము నీవే - జీవ జలము నీవే
నీదు నామమే శక్తి - లేదు ఇలలో సాటి (2)
ప్రతి మోకాలొంగును - ప్రతి నాలుక ఒప్పును
యేసు రాజా నీ యెదుట (2)
||నీవే||
