Thanksgiving
స్తుతి మధుర గీతము - వేలాది స్తోత్రము
Sthuthi Madhura Geethamu - Velaadi Sthothramu
స్తుతి మధుర గీతము - వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము - శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద
||స్తుతి||
కనులకే కనపడలేని నా కంటి పాపవై
కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2)
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా
||స్తుతి||
అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2)
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి
||స్తుతి||
