స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2)
||స్తుతి||
నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము - నా హృదయములో
స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2)
||స్తుతి||
శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన - పరిచర్యలకై
కృపావరములతో నను - అలంకరించితివే (2)
||స్తుతి||
నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము - నను చేర్చుటకై
నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2)
||స్తుతి||
