స్తోత్రించెదము దైవకుమారుని - నూతన జీవముతో (2)
నిరంతరము మారని రాజును - ఘనంబు చేయుదము (2)
యేసు మా రక్షకుడు - కల్మషము లేనివాడు (2)
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2)
భయంకరమైన భీతిని గొల్పెడు - జిగట ఊబినుండి (2)
బలమైన హస్తముతో నన్ను ఎత్తి - బండపై స్థిరపరచెన్ (2)
||యేసు||
కనుపాపగ నను కాయు ప్రభుండు - కునుకడు నిద్రించడు (2)
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2)
||యేసు||
తల్లిదండ్రియు యెడబాసినను - విడువక కాయును (2)
ఎల్లప్పుడు నేను భజియించెదను - వల్లభుడేసు ప్రభున్ (2)
||యేసు||
ఆత్మీయ పోరాటమునకు ప్రభువు - ఆత్మశక్తినిచ్చెన్ (2)
స్తుతియు నీకే ఘనతయు నీకే - యుగయుగములలోన (2)
||యేసు||
