Worship

శ్రమయైనా బాధైనా

Sramayaina Badhaina

Watch on YouTube
శ్రమయైనా బాధైనా - హింసలెన్ని ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు ఖడ్గమే ఎదురైనా - శోధనలు ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు నా రాజు వచ్చుచున్నాడు - భీకరుడై వచ్చుచున్నాడు (2) సర్వోన్నతుడు మేఘారూఢిగా - తీర్పును తీర్చ రానున్నాడు ఎదురేలేని కొదమసింహం - మహా ఉగ్రతతో రానున్నాడు ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు - సర్వము చేసిన సృష్టికర్త మహోన్నతుడు మహేశ్వరుడు - సర్వము గెలిచిన సర్వేశ్వరుడు దేవాది దేవుడు రాజాధి రాజు - ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు విశ్వాసమే నా బలము - నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము శ్రమలేలేని బాధేలేని - ఆ లోకంలో నిరంతరం జీవింతును విమోచకుడు సజీవుడు - నా కనులారా నే చూచెదను యుగయుగములకు మహారాజునితో - పాలించుటకే పోరాడెదను ఓ క్రైస్తవా సోలిపోకుమా - తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో మోసపోకుమా జారిపోకుమా - నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో మంచి పోరాటం నువ్వు పోరాడు - నీ పరుగునే కడముట్టించు విశ్వాసమును కాపాడుము - యేసుని చేర వెయ్యి ముందడుగు ||శ్రమయైనా||