Encouragement

స్నేహితుడా నా స్నేహితుడా

Snehithudaa Naa Snehithudaa

Watch on YouTube
స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా (2) నన్నెంతో ప్రేమించినావు నాకోసం మరణించినావు (2) మరువగలనా నీ స్నేహము మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా|| నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచానే నిరతం నీ తోడుకై (2) ఇచ్చెదన్ నా సర్వస్వము నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా|| కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నను పలుకరించావు (2) మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా||