Prayer

శరణం శరణం శరణం దేవా

Sharanam Sharanam Sharanam Devaa

Watch on YouTube
శరణం శరణం శరణం దేవా - కరుణ నాథుడా (2) కరుణ నాథుడా - ఈ తరుణమే ప్రభో (2) ||శరణం|| పాపరహిత దేవకుమారా - శాపవాహకా (2) శాపవాహకా - నిత్య కోప రహితుడా (2) ||శరణం|| పరిపూర్ణ దేవుడా - నరావతారుడా (2) నరావతారుడా - మా యేసు నాథుడా (2) ||శరణం|| దయామయుండ క్రీస్తు యేసు - దాక్షిణ్య ప్రభువా (2) దాక్షిణ్య ప్రభువా - బాహుళ్య దేవుడా (2) ||శరణం|| నమ్మదగిన లోకరక్షకా - సర్వోపకారుడా (2) సర్వోపకారుడా - సర్వశక్తిమంతుడా (2) ||శరణం|| సాత్వికుండా - సర్వజనుల కాంక్షణీయుడా (2) కాంక్షణీయుడా - వాత్సల్య దేవుడా (2) ||శరణం|| రిక్తుడై తగ్గించుకొనిన - వినయపూర్ణుడా (2) వినయపూర్ణుడా - మముగాచు దేవుడా (2) ||శరణం|| సత్యవంతుడవు - మాదు నిత్యదేవుడా (2) నిత్యదేవుడా - మా మంచి బోధకుడా (2) ||శరణం|| సర్వలోక సృష్టికర్త - సత్యదేవుడా (2) సత్యదేవుడా - మా నిత్యజీవమా (2) ||శరణం|| ఎల్లరిలో శ్రేష్ఠుడా - మా వల్లభుండవు (2) వల్లభుండవు హల్లెలూయ పాడెదం (2) ||శరణం||