సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము
||సేవకులారా||
మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే
మనము గొప్పవారము కాదు
మనము మంచివారము కాదు
మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు
దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు
||ఉన్నత||
ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి
మీ శరీరము దేవుని ఆలయమిది
మీరు విలువ పెట్టి కొనబడిన వారు
సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము
||సేవకులారా||
హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్,
దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్
షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్
సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు
మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము
||ఉన్నత||
