Faith

సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే

Sarvaanga Kavachamu Neeve Praanaathma Dehamu Neeve

Watch on YouTube
సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా (2) నీ పోలికగ చేసి - నీ జీవమును పోసి నా పాపమును తీసీ నా భారమును మోసావయ్యా.. యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ.. నా ప్రాణము నీవే నా యేసయ్యా (2) వాక్యమను ఖడ్గము నీవై - రక్షణను శిరస్త్రాణమై సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై సమాధాన సువార్త నీవై నా యేసయ్యా ||నా సర్వము|| దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై బూడిదెనకు ప్రతిగా పూదండవై దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము నీవై భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రమై ||నా సర్వము||