సరి రారెవ్వరు - నా ప్రియుడైన యేసయ్యకు (2)
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2)
||సరి||
నమ్మదగిన వాడే నలు దిశల - నెమ్మది కలుగ చేయువాడే (2)
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2)
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2)
||సరి||
ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2)
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2)
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2)
||సరి||
పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే (2)
శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే (2)
నాకై అతి త్వరలో మహిమతో రానైయున్నవాడే (2)
||సరి||
